Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 23 సెల్ 9550978955

సాయి విద్యా భారతి ఉత్తమ జాతీయ సేవా పురస్కారాన్ని అందజేసిన జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ

చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గురు నక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం నుంచి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామికి యాలకుల దండలు సమర్పించారు, అనంతరం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ మండవ కృష్ణవేణి శ్రీ దత్త సాయి కి ప్రత్యేక పూజలు జరిపినారు, దాతల సహకారంతో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది, ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ మండల కృష్ణవేణి కు శ్రీ సాయి విద్యా భారతి ఉత్తమ జాతీయ సేవా పురస్కారమును అందజేశారు ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరములుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుతూ సమాజానికి దేశభక్తి పరులైన విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది ప్రత్యేక కృషి చేశారని, ఆమె దగ్గర చదువుకున్నఎంతోమంది విద్యార్థులు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలియజేశారు, సేవకులు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశామని ట్రస్ట్ చైర్మన్ తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పట్టణ పుర ప్రముఖులు అయినవోలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు