మద్నూర్ ఏప్రిల్ 23 జనం న్యూస్
యాసంగి వరి పంట సన్నం వడ్లు ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా పటిష్ట మైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిందని అదనపు కలెక్టర్ వి విక్టర్ అన్నారు.
సలాబత్పూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను గురువారం తనిఖీ చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సిబ్బందికి మౌలిక వసతులు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. అదనపు కలెక్టర్ గారి వెంట తహసీల్దార్ ముజీబ్, ఎన్ఫోర్స్మెంట్ నాయబ్ తహశీల్దార్ కాలిద్, జూనియర్ సహాయకులు రవి, చెక్ పోస్ట్ సిబ్బంది ఏఇవో సరోజ , గ్రామపాలన అధికారి గోపాల్ , కానిస్టేబుల్ హన్మండ్లు ఉన్నారు.


