Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 23: నిజామాబాద్ జిల్లావేల్పూర్ మండల

కేంద్రంలో ఉన్న సాయిబాబా దేవాలయంలో భక్తి వైభవం నెలకొంది. బడా భీంగల్‌కు చెందిన కొత్త నిర్మల శంకర్ దంపతులు గురువారం సుమారు రూ.1,30,000 విలువైన నూతన వెండి కిరీటాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు, ఆలయ అర్చకుడు అనురాగ్ పాండే సమక్షంలో బహుకరించారు.ఈ సందర్భంగా దంపతులు శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించి తమ మొక్కును చెల్లించుకున్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పడిగెలకు చెందిన ఆర్మూర్ గంగారాం కుటుంబ సభ్యులు కూడా అన్నదాతలుగా పాల్గొన్నారు.అలాగే అన్నపూజ, గోపూజలను శాస్త్రబద్ధంగా నిర్వహించగా, ధ్యాన మందిరంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. సుమంగళి మహిళలు హారతులు ఇచ్చి, భజన కళాకారులతో కలిసి సామూహికంగా పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అబ్బగోని జగదీశ్వర్ గౌడ్, కూశన్నగారి నర్సయ్య, గడ్డం మల్లేష్, కొండ అశోక్ గౌడ్ పాల్గొన్నారు. అన్నదాన సత్రంలో రాజారపు బాల్రాజ్, ఇరుపాజి దామోదర్ గౌడ్, నోముల గంగారెడ్డి, వెంకటాపూర్ పద్మ మహేందర్, కోరెం నర్సాగౌడ్, దమ్మాయి లక్ష్మి, కండక్టర్ నర్సయ్యతో పాటు సాయి సేవకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.