Listen to this article

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

​డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు అమలాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని ముమ్మిడివరం శాసనసభ్యులు& ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా బుధవారం కలిసి జిల్లాలోని పెండింగ్ సమస్యలు, అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు.​​ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ప్రధాన ప్రతిపాదనలు ఇవే:అమలాపురం పార్లమెంటు పరిధిలోని శాసనసభ్యులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా, వారు సానుకూలంగా స్పందించారు.ప్రత్యేకంగా,జి. మూలపాలెం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణం కుండలేశ్వరం ప్రాంతంలో కృంగిపోయిన ఏటిగట్టు అభివృద్ధి నియోజకవర్గానికి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు
ముఖ్యమైన అంశాలపై సీఎం అనుకూలంగా స్పందించి, మంజూరు దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా, నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాల అమలు గురించి కూడా సమావేశంలో సమగ్రంగా చర్చించారు. శాసనసభ్యులు గారు ప్రజలకు అవసరమైన ముఖ్య విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.​లంక గ్రామాల అభివృద్ధి: లంక ప్రాంతాల్లో రహదారులు, రవాణా సౌకర్యాలు, తాగునీరు మరియు విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.​కొబ్బరి రైతులకు ఊతం: కొబ్బరి ఉత్పత్తులకు విలువ ఆధారిత (Value Addition) అవకాశాలు కల్పించడం ద్వారా రైతులకు లాభదాయకమైన మార్కెట్ కల్పించాలని సూచించారు.​కొబ్బరి పార్క్ ఏర్పాటు: నియోజకవర్గంలో కొబ్బరి పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి, రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రతిపాదించారు.
​క్రీడారంగం: యువతలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని విన్నవించారు.​మౌలిక సదుపాయాలు: జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సరఫరాపై చర్చించారు.​సానుకూల స్పందన ​ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, అవసరమైన నిధుల కేటాయింపు పనుల వేగవంతానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నాయకులు హర్షం వ్యక్తం చేశారు. “ప్రజల అభ్యున్నతే మా లక్ష్యం, అమలాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం” అని అయితాబత్తుల ఆనందరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.​ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యేలు బత్తుల ఆనందరావు బండారు సత్యానందరావు, గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.