Listen to this article

గ్రామాన్ని సందర్శించిన విద్యుత్ అధికారులు

జనం న్యూస్ ఏప్రిల్ 23: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని

బట్టాపూర్ గ్రామంలో కొనసాగుతున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కదిలారు. ఉపసర్పంచ్ దయానంద్ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంతో, గురువారం జిల్లా డీఈ టెక్నికల్ అధికారి రమేష్ గ్రామాన్ని సందర్శించారు.గ్రామ సర్పంచ్ భూషణ వేణి ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్, ట్రాన్స్కో ఏఈ సురేష్‌లతో కలిసి ఆయన ఇందిరమ్మ కాలనిలో హైటెన్షన్ విద్యుత్ తీగలు, గ్రామంలో ఉన్న వివిధ విద్యుత్ సమస్యలు, అవసరమైన స్థంబాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.ఇదిలా ఉండగా, రెండు నెలల క్రితం గ్రామం నుంచి స్మశాన వాటిక వరకు వేసిన అంచనాల ప్రకారం సింగిల్ ఫేజ్ విద్యుత్ తీగలు మరియు స్తంభాలు మంజూరు చేసినట్లు డీఈ టెక్నికల్ అధికారి తెలిపారు. అలాగే రూ.9,300 చెల్లిస్తే రైతులకు 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు అవుతుందని, గ్రామంలో ఇండ్లకు ఒక కిలోమీటర్ పరిధిలో ప్రభుత్వం ఉచితంగా స్తంభాలు, విద్యుత్ కనెక్షన్ అందిస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో లైన్మెన్ సర్వేశ్వర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.