Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 23: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలంలోని దోంచందా గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచి సీజ్ చేసిన 200 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను బుధవారం బహిరంగ వేలంలోవిక్రయించారు.ఈ వేలంలో ఎరుగట్ల గ్రామానికి చెందిన కల్లెడ సతీష్ (తండ్రి సదానందం) ఒక్క ట్రాక్టర్ ట్రిప్పుకు రూ. 2,720 చెల్లించి అత్యధిక ధరకు ఇసుకను సొంతం చేసుకున్నారు.మొత్తం 200 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకకు గాను ప్రభుత్వం ఖజానాకు రూ. 5,44,000 ఆదాయం లభించింది. వేలంలో పొందిన ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించుకునేందుకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి ఇవ్వబడుతుందని తహసీల్దార్ మల్లయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై పడాల రాజేశ్వర్, రెవెన్యూ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.