Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 23, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :

పట్టణలో గల మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష రాకేష్ వార్డ్ లోని ఏదైనా సమాష్య వారి దృష్టికి రాగానే తక్షణ పరిష్కారం చూపిస్తున్నారు కౌన్సిలర్ అరిగల అనూష రాకేష్, ఈ రోజు వార్డ్ లో మార్కండేయ ఫంక్షన్ హాల్ ఎదురు వీధిలో గల డ్రైనేజ్ గత కొంత కాలం గా చెత్తాచెదారం పేరుకుపోయి మురికి నీటితో నిండి వీధి ప్రజలు ఇబ్బంది గురి అవుతున్నారని తెలుసుకొని ఈ రోజు వార్డులోని డ్రైనేజీ లోని చెత్తను తీయించడం జరిగినది. వార్డులోని ప్రతి గల్లీ గల్లీలో పారిశుద్ధం పనులను వార్డు ప్రజల నుండి తెలుసుకుంటు మున్సిపల్ కార్మికుల దగ్గరుండి పనులు చేయించడం జరిగినది, సమస్యను తెలుసుకొని వెంటనే పరిష్కరించినందుకు గాను వార్డు ప్రజలు అరిగెల అనుష రాకేష్ ని అభినందించారు, ఈ కార్యక్రమంలో నాయకులు ఆరిగెల రాకేష్, మున్సిపల్ సిబ్బంది ముజీబ్, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.