ఆకలితీర్చే హాస్టల్లోనే విద్యార్థి భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ నీలమ్మ
(జనం న్యూస్ ఏప్రిల్ 23 మునగాల మండల రిపోర్టర్ కందిబండ హరీష్)
చదివే ప్రతి వ్యక్తి జీవితాన్నిసమాజాన్ని మార్చగలదు అని మండల విద్యాశాఖ అధికారి పిడతల వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం నందు తెలంగాణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా హాస్టల్ విద్యార్థినీల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో మరియు వసతి గృహాల్లో విద్యార్థినివిద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్ తో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తూ ఉచితంగా విద్యావసతిని అందిస్తుందని విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు.వసతిగృహ సంక్షేమ అధికారి నీలమ్మ మాట్లాడుతూ .. ఆకలితీర్చే హాస్టల్ గదుల్లోనే విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు కావలసిన పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ ఉచితంగా నోటు పుస్తకాలు బట్టలు పంపిణీ చేస్తూ పాలు పండ్లు గుడ్లు, శాఖాహార మాంసాహార భోజనాన్ని సమతుల్యంగా విద్యార్థులకు అందిస్తూ అన్ని రకాల వసతులతో హాస్టల్లో సకల సౌకర్యాలతో విద్యార్థినీ విద్యార్థులు చదువుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తూ, పేద మధ్యతరగతి వెనకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థిని విద్యార్థుల్ని ప్రోత్సహిస్తుందని, కావున పేద విద్యార్థులు సంక్షేమ హాస్టల్లని సద్వినియోగం చేసుకుంటూ బాగాచదువుకొని తమ పాఠశాలకు తల్లిదండ్రులకు గురువులకు పేరు ప్రఖ్యాతలు తేవాలని సూచించారు, అనంతరం విద్యార్థినిల తల్లిదండ్రులతో కలిసి హాస్టల్ నందు సామూహిక భోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు హాస్టల్ విద్యార్థినిలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.



