బిచ్కుంద ఏప్రిల్ 23 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని బండయ్యప్ప ఫంక్షన్ హాల్లో మద్నూర్ మండలం లచ్చన్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మనోహర్ దేశాయ్ కుమార్తె వివాహ వేడుకలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు..ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ పుల్కల్ వెంకటరెడ్డి నాగనాథ్ డెలికేట్ విట్టల్ రెడ్డి అజీమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


