పయనించే సూర్యుడు ఏప్రిల్ 23 ముమ్మిడివరం ప్రతినిధి
కిమ్స్ ప్రాంగణం లో గల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములు కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో గల శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా మూడవ రోజు గురు వారం ఉదయం సుదర్శన హోమం, పూర్ణాహుతి, చక్ర స్నానం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి . మధ్యాహ్నం 3 గంటలకు స్వామి వారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ గ్రామోత్సవంలో పలువురు భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. సాయంత్రం 5 గంటలకు పర్యంక శయనోత్సవం, ఆశీర్వచనం, పండిత సత్కారం, నీరాజనం, మంత్రపుష్పం మరియు తీర్ధ ప్రసాద వితరణ జరిగాయి.ఈ బ్రహ్మోత్సవాలలో అత్యంత భక్తి శ్రద్దలతో పాల్గొని జయప్రదం చేసిన స్థానిక భక్త జనులను మరియు కిమ్స్ సిబ్బందిని కిమ్స్ ఛైర్మన్ శ్రీ కె.వి.వి.సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) అభినందించారు.



