Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహరాపూర్ (మందారి పేట)గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాలు విస్తృత స్థాయిలో కొనసాగుతున్నాయని గ్రామ సర్పంచ్ కుక్కల సరోజన అన్నారు గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పలు పారిశుద్య చర్యలు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని వాటర్ ట్యాంకులను ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రపరచి బ్లీచింగ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే మురికి కాలువలను కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేసి చెత్త తొలగించి బ్లీచింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.డ్రైనేజీల నుంచి తీసిన మురికిని మరుసటి రోజే పూర్తిగా తొలగించే చర్యలు తీసుకుంటున్నట్లు, రోడ్లకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ గ్రామ పారిశుద్యాన్ని మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు.ఈ చర్యల ద్వారా రాబోయే రోజుల్లో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించవచ్చని, గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ఈ విధి విధానాలు పొందుపరిచినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ సహకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆమె కోరారు.మన గ్రామం మన బాధ్యత అనే నినాదంతో ఈ కార్యక్రమాలు కొనసాగించాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అజయ్, చలివాగు ప్రాజెక్ట్ డైరెక్టర్ కుక్కల తిరుపతి, బడుగు సునీల్, తక్కల్ల సారయ్య, పిండి రవి, పూజారి సారయ్య, నిమ్మల యాదయ్య, లక్కర్స్ మొగిలి తదితరులు పాల్గొన్నారు….