జనం న్యూస్ 24 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి రేవంత్ రెడ్డిదే బాధ్యత ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో *మోసపూరిత రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ గత మూడు రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి,బాసు హనుమంతు నాయుడు తన సంపూర్ణ మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపారు* అనంతరం, తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ నిన్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి, శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు గతంలో కేసీఆర్ ప్రకటించారు అని గుర్తు చేశారు..కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రశ్నించారు ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అని అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిది అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండున్నరేండ్లు అవుతున్నది అప్పటి నుంచి తమ సమస్యలు పరిషరించాలని ఆర్టీసీ కార్మికులు వేడుకుంటున్నా ఇప్పటికీ అతీగతి లేదు. దీంతోనే కార్మికులు సమ్మెకు దిగాల్సివచ్చింది అని అన్నారు..మంత్రి పొన్నం ప్రభాకర్ అధికార దాహంతో కార్మికుల సమస్యలను పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మికులకు ఏం జరిగినా రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే భాధ్యత అని హెచ్చరించారు ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని సూచించారు ఆర్టీసీ కార్మికులకు బిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాగర్ దొడ్డి వెంకట్రాములు, వెంకటేశ్వర రెడ్డి,బీచుపల్లి,అల్లపాడు ప్రతాప్,పటేల్ జనార్దన్ రెడ్డి,కోటేష్,మోనేష్,కౌన్సిలర్లు పులిపాటి వెంకటేష్,గువ్వల గోపాల్,చిత్తరి కిరణ్,మోహన్ యాదవ్,కమ్మరి రాము,గంజిపేట రాజు,కురవ పల్లయ్య,జాంపల్లి భరత్ సింహారెడ్డి, డ్యామ్ శ్రీను,రాము,గోనుపాడు మాలిక్,కృష్ణ,మోహన్,జగదీష్, అఖిల్, వినయ్,నరసింహులు,రాజేష్,గోవిందు, అంజి,వెంకటేష్,మన్యం, ప్రవీణ్, వీరేష్,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


