Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం

జనం న్యూస్ ఏప్రిల్. 24. 04. 2026 నర్సంపేట డిపో కార్మికుడు శంకర్ గౌడ్ ప్రభుత్వ వైఖరికి భయపడి ఆత్మాహుతి చేసుకోవడం ఇది పూర్తగా ప్రభుత్వ హత్యానే. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో ఆర్టీసీ కార్మికుల పాత్ర చాలా కీలకమైనది.కార్మిక జెఏసి 40 రోజుల ముందే సమ్మె నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం స్పందించక పోవడంతో వారు సమ్మెకు వెళ్తే అది పరిష్కరించాల్సింది పోయి ఇది హరీష్ రావు చేస్తున్న కుట్ర అని మంత్రి చెప్పడం దుర్మార్గపు చర్య,ప్రజా సమస్యల పరిష్కారం కోసం మా బిఆర్ఎస్ పార్టీ,కేటీఆర్,హరీష్ రావు లు ఎల్లప్పుడు పోరాడుతూనే ఉనటారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని ప్రభుత్వం చట్టం కూడా తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం వారికి అపాయింటెడ్ డేట్ ఇచ్చి దాన్ని అమలు చేస్తే సరిపోతుంది.ఈ రోజు ఆర్టీసీలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులు తెస్తే వాటిని ప్రయివేటు వారికి అప్పజెప్పడం వలన కార్మికులు అయోమయంలో పడ్డారు,కార్మికులు సమ్మెకు పోతే వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని ప్రకటనలు ఇవ్వడం ఆందోళనలకు గురి చేస్తున్నది.వారు గొంతెమ్మ కోరికలు కొరడం లేదు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయమంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వంమే ఆదుకోవాలని డిమాండ్,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,నాయకులు యస్.గోపాల్,పాల్గొన్నారు