Listen to this article

జనం న్యూస్ 24 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, కురువ పల్లయ్య ఐజ రాజోలి వడ్డేపల్లి మండలాల్లో 22న కురిసిన వడగండ్ల వానతో వందల ఎకరాల్లో సర్వనాశనమైన వరి పంట వడగండ్ల వానతో గింజలు రాలిపోయిన వరిగడ్డితో గద్వాల కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు చేస్తున్న నిరసనకు రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, కురువ పల్లయ్య మద్దతు తెలిపారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈనెల 22వ తేదీన రాజోలి వడ్డేపల్లి ఐజ మండలాల్లో వడగండ్ల వాన తీవ్రమైన గాలితో కురిసింది దీంతో అనేక గ్రామాల్లో ఉప్పల చిన్న తాండ్రపాడు క్యాంపు మసనూరు మాన్దొడ్డి పులికల్లు రాజాపురం తనగల బైనపల్లె కొత్తపల్లి తదితర గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగింది ప్రభుత్వం అంచనాల ప్రకారం సుమారు రెండువేల ఎకరాల్లో పంట పూర్తిగా పాడైపోయింది ఒక్కో ఎకరంలో 30 గంటలు పండే వరి ధాన్యం చేతికి వచ్చిన పంట నేల పాలయ్యింది కనీసం గడ్డి కూడా పనికి రాకుండా పోయింది మా పెద్దలు కూడా ఇటువంటి పరిస్థితిని చూడలేదని రైతులు వాపోతూ ప్రభుత్వమే రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటూ ఉప్పల గ్రామ రైతులు పెద్ద ఎత్తున ఈరోజు గద్వాల కలెక్టర్ కార్యాలయం చేరుకొని అధికారుల ముందు తమ పరిస్థితిని తమ గోడును వివరించారు తమను ఆదుకోకపోతే గత వర్షాకాలం అధిక వర్షాలతో నష్టపోయామని కనీసం రవి పంట నైన పండించుకుందామని కలలు గన్న ఇక వారం రోజుల లో కోతకొచ్చిన చేతికొచ్చిన పంట రెండు గంటలలో నేలమట్టమవడం చూసి రైతులు నేలపట్టారు ఇంతవరకు చిన్నా అధికారులు వచ్చి చుచారే తప్ప పెద్ద నాయకులు గానీ పెద్ద అధికారులు కానీ తమను పట్టించుకోలేదని వారు వాపోయారు ఈ సందర్భంగా కలెక్టర్ ఏవో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో రైతులు రవికుమార్ రెడ్డి, కృష్ణ యాదవ్, వీరేష్, తిమ్మప్ప, వినయ్, వినోద్, రామకృష్ణ, లింగప్ప, మల్లేష్, భీమన్న, రాజు, జమన్న, సురేష్, బీముడు, జయన్న, పరుశరాముడు, శివరాజు, సోమశేఖర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.