Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద

మండల కేంద్రంలోని పుల్కల్, గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా విషయమై సబ్ కలెక్టర్ కిరణ్మయి శనివారం రోజు పుల్కల్ గ్రామ ట్రాక్టర్ యజమానులతో సమావేశమయ్యారు. మన ఇసుక వాహనం_ పోర్టల్ ద్వారా ప్రభుత్వ గృహ నిర్మాణ, అభివృద్ధి పనులకు ఇసుక సరఫరాపై చర్చించారు. : పోర్టల్‌లో రిజిస్ట్రేషన్, బుకింగ్ ప్రక్రియను వివరించి, అధిక ధరలు వసూలు చేయకుండా సకాలంలో ఇసుక సరఫరా చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం, ఇతర ప్రభుత్వ పనులు వేగవంతం చేసేందుకు పారదర్శకత సరసమైన ధరలతో అంతరాయం లేకుండా ఇసుక సరఫరా చేయాలని స్పష్టం చేశారు.ట్రాక్టర్ యజమానులు సానుకూలంగా స్పందించి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ తో పాటు తాసిల్దార్ వేణుగోపాల్ పుల్కల్ సర్పంచ్ పుల్కల్ ట్రాక్టర్ గ్రామ సెక్రెటరీ యజమానులు తదితరులు పాల్గొన్నారు

.