Listen to this article

జనం న్యూస్ : 26 ఏప్రిల్ ఆదివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;

సిద్దిపేట పట్టణంలోని దీక్ష పరివార్ స్కూల్ సీతారామాంజనేయ థియేటర్ వెనుక వేదికగా శారద కాలిగ్రఫీ అకాడమీ మరియు యెలిగేటి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో చేతిరాత మరియు చిత్రలేఖన శిక్షణ శిబిరం ప్రారంభమైంది చేతిరాత శిక్షకుడు క్యాతం అశోక్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26వ తేదీ నుండి ప్రారంభమైన ఈ శిక్షణ శిబిరంలో విద్యార్థులకు అందమైన చేతిరాతతో పాటు నైతిక విలువలు, నీతి కథలు, ఏకాగ్రత పెంపొందించే అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించబడుతుంది.ఈ శిక్షణ 15 రోజుల పాటు కొనసాగనుండగా, ప్రతిరోజూ ఉదయం 8:00 గంటల నుండి 10:30 గంటల వరకు తరగతులు నిర్వహించబడతాయి.
అలాగే వై. రమేష్ ఆధ్వర్యంలో మాట్లాడే బొమ్మ (వెంట్రిలాక్విజం), మ్యాజిక్ టెక్నిక్స్, చిత్రలేఖనం టెక్నిక్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం మరియు వేదికపై ప్రదర్శన నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఈ శిబిరం రూపొందించబడింది.తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.మరిన్ని వివరాలకు: కె.అశోక్ 99493 53941, 9885225563.వై.రమేష్ ను సంప్రదించవలసినదిగా వారు కోరారు.