Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలో ని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల కరపత్రాలను ఆదివారం దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి మాజీ సర్పంచ్ అడ్వకేట్ గట్ల విజయపాల్ రెడ్డి జిన్నా ప్రతాప్ సేనా రెడ్డి ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి మాట్లాడుతూ ఏప్రిల్ 29వ తేదీ బుధవారం నుండి మే 3 తేదీ ఆదివారం వరకు శ్రీ మత్స్యగిరి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రాయరాకుల సుమన్ గట్టు సురేష్ పాల్గొన్నారు…..