జనం న్యూస్ ఏప్రిల్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలో ఏప్రిల్ 27 న బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండ్ర జ్యోతి-వెంకటరమణారెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త సమన్వయంతో పని చేస్తూ రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు
అనంతరం గంగుల సరస్వతి -మనోహర్ రెడ్డి పెళ్లిరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, గ్రామశాఖ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, కోశాధికారులు, యూత్ నాయకులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, వివిధ సంఘాల అధ్యక్షులు, రైతుబంధు సమితి నాయకులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, అత్యధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.


