(జనం న్యూస్ ఏప్రిల్ 27 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ )
గడిచిన రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో మునగాల మండలంలో ఇంధన కొరత తీవ్రమైంది.మండలంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద “నో స్టాక్” బోర్డులు దర్శనమిస్తున్నాయి.స్టాక్ ఉన్న చోట సోమవారం తెల్లవారుజామున నుంచే కిలోమీటర్ల మేర వాహనాల క్యూ లైన్లు కనిపించాయి.ఈ సందర్భంగా పలువురు వాహనదారులు మాట్లాడుతూ..ఇంధన కొరతపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని వాహనదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


