Listen to this article

రానున్నది వైసీపీ ప్రభుత్వమే.

వెదురుపాక గ్రామ సర్పంచ్ మల్లిడి సూరారెడ్డి

జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గ ప్రతినిధి (ఫిబ్రవరి 15 అంగర వెంకట్)రానున్న కాలంలో వైసీపీ ప్రభుత్వం పాలనలోకి వస్తుందని వెదురుపాక గ్రామ సర్పంచ్ మల్లిడి సురారెడ్డి (పెద్దబ్బాయి) పేర్కొన్నారు. మండలంలోని వెదురుపాక గ్రామంలో సర్పంచ్ పదవి కాలానికి నాలుగు సంవత్సరాల పూర్తయిన సందర్భంగా గ్రామ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు పెద్దబ్బాయి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు వార్డు మెంబర్లతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో  పెద్దబ్బాయి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, రానున్న ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం పగ్గాలు చేపడుతుందని ఆయన అన్నారు. గురువారం గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని ఆయన కోరారు.పార్టీ సీనియర్ నాయకులు పెదబాబు మాట్లాడుతూ గతంలో ఏ ప్రెసిడెంట్ చేయని విధంగా నభూతో నా భవిష్యతి అన్న విధంగా పెద్దబ్బాయి పాలన చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో చంద్రబాబు మోసం చేశారని, కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి  తొమ్మిది నెలలు పూర్తయినప్పటికీ పేదవాడికి ఎటువంటి సంక్షేమ పథకము అమలు చేయలేకపోయారని పార్టీ సీనియర్ నాయకులు సత్తి పద్దారెడ్డి, తాడి బుల్లి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ నాయకులకు కార్యకర్తలకు, వార్డు మెంబర్లకు, స్వీట్లు  పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ పెద్దబ్బాయి ను కార్యకర్తలు దుస్సాల తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్ సీపీ నాయకులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.