జనం న్యూస్: ఏప్రిల్ 28 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్
కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఎండగట్టండి
కొండేటి శ్రీను సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు
తెలంగాణలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతతో పెట్రోల్ బంక్ ల ముందు నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి, దీంతో ప్రజలు రైతులు,వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంగళవారం నిడమనూరు మండల కేంద్రంలో *సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను* విలేకరులతో మాట్లాడుతూ కేవలం లాభా పేక్షతోనే ఈ ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలు కలిపి సామాన్యుడిని దోచుకునేందుకు పన్నిన కుట్రలో భాగమే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి. సమురు సంస్థల ద్వారా అన్ని బంక్ లకు ఆయిల్ సరఫరా పునరుద్ధరించాలని కోరారు, ఒకవైపు దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెబుతూనే. మరోవైపు కృత్రిమ కొరతను సృష్టించడం కేంద్ర బిజెపి ప్రభుత్వ దుర్చర్యకు నిదర్శనం, *ఇరాన్- ఇజ్రాయిల్* యుద్ధం నేపథ్యంలో ఆయిల్ సంక్షోభాన్ని నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచకుండా నిలిపివేసి, ఎన్నికలు ముగిసిన వెంటనే సామాన్యుడిపై ధరల భారం మోపే ఎందుకు రంగం సిద్ధం చేసింది, రష్యా నుంచి అతి తక్కువ ధరకు ముడి చమురు దిగుమతి చేసుకున్నా. ఆ లాభాన్ని ప్రజలకు పంచకుండా కేవలం కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతుందని, పెట్రోల్ బంక్ డీలర్లు ముందస్తుగా వందల కోట్ల రూపాయల డిపాజిట్లు చెల్లించినప్పటికీ చమురు సంస్థలు ఆయిల్ ట్యాంకర్లను పంపడం లేదు, డీజిల్ దొరకక రైతులు,పలు ఇబ్బందులు పడుతున్న, ఇంధనం దొరకక లారీలు వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని, దీంతో నిత్యవసరాల ధరలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని, పెట్రోల్ బంకు యజమానులు ప్రైవేటు వ్యక్తులకు బ్లాక్ లో అమ్ముకోవడానికి లీటర్ల కొద్ది పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారని, బ్లాకులో వాహన దారులకు లీటర్ కు 50 నుండి 100 రూపాయల అదనంగా అమ్ముతున్నారని, జిల్లా ఉన్నంత అధికారులు పట్టించుకోవడంలేదని ఆయిల్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వం కలిసి ప్రజలపై అధిక భారాలు మోపాలనే కుట్ర జరుగుతుందని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో *సిపిఎం మండల కార్యదర్శి కందుకూరు కోటేష్, మండల కమిటీ సభ్యులు కోమాండ్ల గురువయ్య, మళ్లీ కంటి చంద్రశేఖర్, వెంపటి మహేష్, బొడ్డు లింగయ్య, కోమండ్ల ఆంజనేయులు, వింజమూరి పుల్లయ్య* తదితరులు పాల్గొన్నారు


