జనం న్యూస్ 28 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఈరోజు గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం పరిధిలోని రేకుల పల్లి, అనంతపురం గ్రామంలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్ జిల్లా సీనియర్ నాయకులు రమేష్ నాయుడు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యము కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో కరువు కాటకా లకు నిలయంగా ఉండేది కానీ గత పది సంవత్సరాల నుండి ఇప్పుడిప్పుడే రైతులు అభివృద్ధి చెందడం జరుగుతుంది. గతంలో కూడా రైతులు పండించిన వరి ధాన్యమును ప్రభుత్వమే కొనుగోలు చేసేది ఈ ప్రభుత్వాలు వచ్చిన రైతుల సంక్షేమమే కోసంమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో నే మద్దతు ధర 2386 రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించాలని మహిళా సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు కూడా ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ధాన్యము కొనుగోలు చేసిన వెంటనే రెండు మూడు రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు నమోదు కావడం జరుగుతుంది. రైతులకు రైతులకు వరి కొనుగోలు కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్ని బ్యాగుల కొరత లేకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఎలాంటి ఇబ్బందు లేకుండా నిదానంగా తమ పండించిన పంటను ధాన్యము కొనుగోలు కేంద్రంలో అమ్మి కొనుగోలు కేంద్రానికి వారికి సహకరించాలని కోరారు రైతులకు ఎమ్మెల్యే సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివ నాయకులు సంగాల నర్సింహాలు, జగదీశ్వర్ రెడ్డి జయరాం రెడ్డి రాంబాబు గౌడ్ నాయకులు కార్యకర్తలు రైతులు అధికారులు తదితరులు పాల్గొన్నారు


