Listen to this article

జనం న్యూస్ 28 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య కొత్త కమీషనర్ కు పాత సమస్యల పత్రం హైదరాబాద్,:జర్నలిస్టుల సమస్యలు చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నాయని, సమస్యలను మీరైనా వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ నూతన స్పెషల్ కమీషనర్ ముకుందరెడ్డిని కోరారు. స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ముకుంద రెడ్డిని సోమవారం ఆయన పలవురు ఫెడరేషన్ నాయకులు కలిసి అభినందనలు తెలిపి జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పత్రాన్ని అందజేశారు.బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమానికి ఎటువంటి కేటాయింపులు లేవని, జర్నలిస్టుల సంక్షేమం, చిన్న, మధ్యతరహా పత్రికలుపిరియాడికల్స్ పట్ల గత రెండేళ్లుగా ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, సరైన అడ్వర్టయిజ్మెంట్స్ లేవని ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టయిజ్మెంట్స్ కి బిల్స్ ఇవ్వడం లేదని, ఫలితంగా ప్రచురణకర్తలు తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో పడ్డారని మామిడి సోమయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించిన బిల్లులు గత రెండు సంవత్సరాలుగా ఇవ్వకపోగా, పైగా గత కొన్ని నెలలుగా పిరియాడికల్స్ కు ప్రభుత్వం ఇచ్చే ప్రకటలు పూర్తిగా నిలిపివేశారని, ఒకవైపు ప్రభుత్వ ప్రకటనలు సరిగా లేక మరోవైపు పెండింగ్ బిల్లులు రాక అనేక చిన్న, మధ్య తరహా పత్రికలు, పీరియాడికల్స్ గత రెండేండ్లుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ఆయన కమీషనర్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా రాష్ట్రంలో అనేక చిన్న, మధ్యతరహా పత్రికలను ఎంపానల్మెంట్ చేయకుండా చాలా ఏళ్లుగా పెండింగ్ లో పెట్టారు. దీని వల్ల చాలామంది పత్రికల నిర్వాహకులైన జర్నలిస్టులు ఆర్థిక భారం మోయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ ఎన్ ఐ,పీఆర్ జీఐ అనుమతితో నడుస్తున్న పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు లేవు. కనీసం అక్రెడిటేషన్ కార్డులైనా ఇవ్వడం లేదు.కావున వెంటనే ఈ సమస్యలను పరిష్కరించి రాష్ట్రంలో చిన్న మధ్య తరహా పత్రికలను ఆదుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమానికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి.కేబుల్ ఛానల్ లకు అక్రెడిటేషన్లు జారీ చేసే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. కేబుల్ ఛానల్ లకు పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చే విధంగా జీవో 252 ను సవరించాలి. ఇకపోతే జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు. అనేక రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ ఇస్తుండగా మన రాష్ట్రంలో ఏ ఒక్క సీనియర్ జర్నలిస్టుకి పెన్షన్ ఇవ్వడంలేేదని అన్నారు. రెండేళ్ళుగా జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వలేదని, పాత కార్డులకు ప్రతీ రెండు నెలలకోసారి స్టిక్కర్ వేస్తూ పొడిగిస్తున్నారని, కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీకి జీవో 252 విడుదలై మూడు నెలలైనా ఇంత వరకు కార్డులు ఇవ్వలేదని, పాత కార్డుల గడువు ఇంకో రెండు రోజులే ఉండగా కొత్త కార్డులు ఇంకా ఇవ్వకపోవడం ఆందోళనకరమని మామిడి సోమయ్య పేర్కొన్నారు. అదే విధంగా జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అవి కూడా ఇంత వరకు లేవు. కావున సమస్యలను తమరు సానుకూలంగా పరిశీలించి ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామని అన్నారు. కమీషనర్ ను కలిసిన వారిలోమామిడి సోమయ్యతో పాటు ఫెడరేషన్ రాష్ట్ర కో-కన్వీనర్ తన్నీరు శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సామ్రాట్ గుప్తా, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ ఎం. రవికుమార్, కో-కన్వీనర్ ఆర్.శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు గోవింద్, రవి కుమార్, బ్రహ్మం తదితరులు*పరిష్కరించాల్సిన సమస్యలు*1.రాష్ట్ర బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించాలి.2.చిన్న, మధ్య తరహా పత్రికలకు, పీరియాడికల్స్ కు రావాల్సిన అడ్వర్టైజ్మెంట్స్ బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలి. 3.రెగ్యులారిటీ ఉన్న చిన్న,మధ్య తరహా దినపత్రికలు, పీరియాడికల్స్ ను ఎంపానల్మెంట్ చేయాలి. 4.చిన్న పత్రికలకు పెద్ద పత్రికలతో సమానంగా ప్రభుత్వ ప్రకటనలు రెగ్యులర్ గా విడుదల చేయాలి. 5.రెగ్యులారిటీ ఉన్న చిన్న, మధ్యతరహా పత్రికలను ఎంపానల్మెంట్ చేయాలి.6.ఆర్ ఎన్ ఐ,పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ తో నడుస్తున్న ఎంపానల్మెంట్ లేని పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలి.7.కేబుల్ టీవీ ఛానల్ లకు పాత పద్ధతిలోనే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. జీవో 252 ను సవరించాలి.8.అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలి.9.సుప్రీం కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలివ్వాలి.10.పదవీ విరమణ పొందిన సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలి.11.జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి.12.ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి.