Listen to this article

మేడే వారోత్సవాలు జయప్రదం చేయండి జిల్లాఉపాధ్యక్షులు కడారి నాగరాజు

జనం న్యూస్ ఏప్రిల్ 28

చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మిషన్ భగీరథ లో పనిచేస్తున్న కార్మికులకు గత ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం సరైనది కాదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు అన్నారు మంగళవారం చిలిపి చెడు మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ పెద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు సరైన వేతనం ఇవ్వకపోను ఇచ్చే వేతనం 6 నెలలుగా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే వేతనాలు చెల్లించాలని లేనిపక్షంలో కార్మికులను ఐక్యం చేసి పోరాటం చేస్తామని తెలిపారు చికాగో నగరంలో కార్మికుల ప్రాణత్యాగాలతో పోరాడి సాధించుకున్న పని గంటలను తగ్గింపును ఇప్పటి ప్రభుత్వం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని అన్నారు కార్మిక చట్టాలు ను రద్దుచేసి 4 లేబర్ కోర్సు ఏప్రిల్ నుండి అమలు చేస్తుందని లేబర్ కోర్సు అమలు చేయడం అంటే కార్మికుల హక్కులను పెట్టుబడిదారులకు కట్టబెట్టడమే అవుతుందని అన్నారు బ్రిటిష్ కాలం నుండి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను తొలగించడం సిగ్గుచేటు అన్నారు దేశం మొత్తం కరోనాతో అతలాకుతం అవుతుంటే దుర్మార్గంగా బిజెపి కేంద్ర ప్రభుత్వం 2019 2020 లో 4 లేబర్ కోడులు తీసుకురావడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో సంపన్నులు పెరిగారని నిరంతరం కష్టపడుతున్న కార్మికులు రోడ్డున పడే దుస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు మే డే స్ఫూర్తితో దేశంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా ఒకటి నుండి ఏడు వరకు మేడే వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శేఖర్ నవీన్ నర్సింలు మల్లేశం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు