బుద్ధుని జీవితాన్ని తెలుసుకోవాలి ఆచరించాలి- స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీనివాస రావు
జనంన్యూస్-ఏప్రిల్,28 నాగార్జునసాగర్ టౌన్ –
గౌతమ బుద్ధుని జీవితం చాలా గొప్పదని, ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ పి. వి. శ్రీనివాస రావు అన్నారు.అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్లు పి వి.శ్రీనివాసరావు, మొహసిన పర్వీన్, దేశాల భూపాల్, బి.అయోధ్య రెడ్డి లు మంగళ వారం సందర్శించారు. సోమవారం రైట్ ఇన్ఫర్మేషన్ ఆక్ట్ పైన సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమవారం రాత్రి నాగార్జునసాగర్ లోని తెలంగాణ టూరిజం విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరికి మిర్యాలగూడ ఇంచార్జ్ సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం టూరిజం లాంచిలో నాగార్జున సాగర్ జలాశయంలో కాసేపు విహరించిన అనంతరం బుద్ధవనం సందర్శించారు. బుద్ధవనం సందర్శనలో భాగంగా బుద్ధ చరిత వనములోని బుద్ధ పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి వందనం సమర్పించారు. అనంతరం వీరు బుద్ధ చరిత వనం, ధ్యానవనం, స్థూప వనాలను సందర్శించారు. మహా స్తూపం అంతర్భాగంలోని సమావేశ మందిరంలో బుద్ధ వనం విశేషాలు తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించారు. మహా స్థూపం లోని ధ్యాన మందిరంలో బుద్దవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రలు వీరిచే బుద్ధ జ్యోతులను వెలిగించి బుద్దవనం కండువాలతో,బ్రోచర్లతో సత్కరించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధ వనం విశేషాలను వివరించారు. వీరితోపాటు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ల కార్యదర్శులు కే. ప్రమీల, డి జె. వరలక్ష్మి, జే. రాము, పెద్దవూర తాసిల్దార్ బానోతు కాసిం, ప్రోటోకాల్ ఆఫీసర్ దండా శ్రీనివాస్ రెడ్డి, ఎస్ ఐ ముత్తయ్య తదితరులు ఉన్నారు.


