జనం న్యూస్ ; 29 ఏప్రిల్ బుధవారం; సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;సిద్ధిపేటలోని యూనియన్ ఆర్ ఎస్ ఈ టి ఐ ఆధ్వర్యంలో యువత, మహిళలు, రైతుల కోసం 64 రకాల ఉచిత స్వయం ఉపాధి శిక్షణా కోర్సులు అందుబాటులో ఉన్నాయని డైరెక్టర్ ఆర్. గేము నాయక్ తెలిపారు. నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు పొందేందుకు, స్వయం ఉపాధి వైపు అడుగులు వేయేందుకు ఈ కోర్సులు ఎంతో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. మహిళల కోసం అందిస్తున్న కోర్సులు:మహిళల టైలరింగ్, బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్, జ్యువెలరీ మేకింగ్, జూట్ బ్యాగ్స్ తయారీ తదితర కోర్సులు అందిస్తున్నట్లు తెలిపారు. పురుషుల కోసం కోర్సులు:ఏసీ రిపేరింగ్, ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ, సీసీటీవీ ఇన్స్టాలేషన్, మొబైల్ రిపేరింగ్, బైక్ మెకానిక్, కార్ డ్రైవింగ్ వంటి ఉపాధి ఆధారిత శిక్షణలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసం ప్రత్యేక శిక్షణలు:డెయిరీ ఫార్మింగ్, మష్రూమ్ కల్టివేషన్, గొర్రెల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు.శిక్షణతో పాటు మార్గదర్శకత్వం కల్పిస్తూ స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.చిరునామా:యూనియన్ ఆర్ ఎస్ ఈ టి ఐ సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా, బైపాస్ రోడ్, సిద్ధిపేట. సంప్రదించవలసిన నంబర్లు:9966829102, 8125634615, 9949882026, డైరెక్టర్: ఆర్. గేము నాయక్ సంప్రదించండి.


