Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివను ఉదయం 6 గంటలకే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.ఈ సందర్బంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన లో విద్యార్థులు తీవ్ర మనోవేదన కు గురవుతున్నారని ఫీజు రీఎంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని అవి వెంటనే విడుదల చేయాలని మండిపడ్డారు ఇందులో భాగంగా ఈరోజు వృత్తి విద్యా కళాశాలలో డిగ్రీ కళాశాలలో బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బంద్ పిలుపునివ్వగా కనీసం విద్యార్థుల సమస్యలపై పోరాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధాలు విధిస్తున్నారని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు అని రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని విద్యార్థులు ప్రజలు యువకుల రైతుల చేతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర పరాజయం పొందుతుందని ఎద్దేవా చేశారు ఈ అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేయాలని రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది ప్రజా పాలన కొనసాగించాలని అన్నారు…