Listen to this article

(జనం న్యూస్ ఏప్రిల్ 29 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్) తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి పై మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాల అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ నాయకులు ఓరవలేక రాష్ట్ర మంత్రి పై అనుచిత వాక్యాలు చేయటం సిగ్గుచేటని ఆయన అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై వెంటనే నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనకకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాసర్ల శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జిలేపల్లి వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పిట్టల శ్రీనివాస్,బిట్టు వెంకటేశ్వర్లు,బిట్టు లింగయ్య,కోట ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.