Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని నేరేడుపల్లి ప్రగతి సింగారం గ్రామం లోరైతు ముంగిట శాస్త్రవేత్తలు” (ఆర్ఎంఎస్) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వరంగల్ అగ్రికల్చర్ కాలేజీ శాస్త్రవేత్తలు నేరుగా క్షేత్రస్థాయిలోకి వచ్చి, సాగులో ఎదురవుతున్న సవాళ్లు లాభసాటి పద్ధతులపై రైతులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డా. విద్యాధర్ మాట్లాడుతూ. వరంగల్ ప్రాంతంలోని నల్ల రేగడి ఎర్ర చల్కా నేలలు ఏళ్ల తరబడి వరి, పత్తి సాగుతో అలసిపోయాయని, వరి కోసిన వెంటనే తేమను వాడుకుంటూ మినుము లేదా పెసర వంటి పప్పుధాన్యాలు వేయడం వల్ల నేలలో సహజంగానే నత్రజని పెరుగుతుందని ఇది భూసారాన్ని పెంచడమే కాకుండా తర్వాతి పంటకు పెట్టుబడిని తగ్గిస్తుంది” అని వివరించారు. అనంతరం టీచింగ్ అసోసియేట్ డా. సిద్ధార్థ నాయక్ మాట్లాడుతూ.. వరంగల్ వాతావరణ పరిస్థితులకు పంట మార్పిడి ఒక రక్షణ కవచం వంటిది. పత్తి తర్వాత మళ్లీ పత్తి వేయకుండా వేరుశనగ లేదా మొక్కజొన్న వేయడం వల్ల గులాబీ రంగు పురుగు వంటి చీడపీడల చక్రాన్ని అరికట్టవచ్చని అలాగే పత్తిలో కందిని (8:1 నిష్పత్తి)* అంతర పంటగా వేయడం వల్ల అదనపు ఆదాయంతో పాటు సుస్థిరత లభిస్తుంది” అని రైతులకు తెలియజేశారు .అధికారులు ప్రజా ప్రతినిధుల ప్రసంగాలు.మండల వ్యవసాయ అధికారి ఎం. ప్రియదర్శిని మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి, శాస్త్రవేత్తలు సూచించిన ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. స్థానిక సర్పంచ్ ఎం. సరోజ, ఉప సర్పంచ్ దాసరి లక్ష్మారెడ్డి, ఏఈవో జటోత్ సానియా వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు వి. అజయ్ గాంధీ, ఎం. ప్రశాంత్ రైతు సోదరులు శాస్త్రవేత్తల చొరవను అభినందిస్తూ, గ్రామాల్లో ఇలాంటి అవగాహన సదస్సులు నిరంతరం జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రగతిసింగారం రైతులు, మహిళా రైతులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి తెలియజేశారు.