Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : ఎన్.కె.ఎన్.ఆర్ గార్డెన్స్‌లో మామిళ్ల కుటుంబ సభ్యుల వివాహ వేడుక ఘనంగా, ఆత్మీయ వాతావరణంలో జరిగింది. ఈ శుభకార్యానికి రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివాహ వేడుకలో నూతన దంపతులైన సాత్రిక – సందీప్ యాదవ్‌లను వడ్డేపల్లి రాజేశ్వరరావు అభినందించి, వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో సాగాలని హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించిన ఆయన, పెళ్లి సంబరాల్లో భాగస్వామ్యమవుతూ వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వేడుకకు విచ్చేసిన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతో వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆత్మీయంగా పలకరించి, అందరితో కలిసి పెళ్లి విందులో పాల్గొన్నారు. ఆయన సాన్నిధ్యం వేడుకకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో మూసాపేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కోడిచెర్ల మహేందర్, బీజేపీ సీనియర్ నాయకులు ఐలయ్య యాదవ్, కోడిచెర్ల వినోద్, కృష్ణ యాదవ్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.