Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 30 సెల్ 9550978955 : డ్వాక్రా సంఘాలు ఆర్థిక ప్రగతి దేశానికే గర్వకారణం ప్రత్తిపాటి చంద్రబాబు మానసపుత్రికలు డ్వాక్రా సంఘాల పనితీరుపై సర్వత్రా ప్రశంసలు : ప్రత్తిపాటిడ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే మొదటి మునగ ఆకు ప్రాసెసింగ్ యూనిట్ యడ్లపాడులో ఏర్పాటు కావడం సంతోషకరం ప్రత్తిపాటి కోటి 40లక్షల వ్యయంతో జిల్లాలో మొదటి మునగ ఆకు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది : ఎంపీ లావు భవిష్యత్ లో ఈ తరహా యూనిట్ మండలానికి ఒకటి వచ్చేలా చూస్తాం : లావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘ మహిళల ఆర్థికాభివృద్ధికి విశేషంగా సహకరిస్తున్నాయని, వారి ఆర్థికాభివృద్ధికి చేయూత నందిస్తున్నాయని శాసనసభ్యులు, టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయల సహకారంతో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో నిర్వహించే మునగ ఆకు ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి భూమిపూజ చేయడం జరిగిందన్నారు. యడ్లపాడు మండలం చెంగిజ్ ఖాన్ పేటలో సెర్ఫ్ ఆధ్వర్యంలో ఎస్.బీ.ఐ ఆర్థిక సహకారంతో ఏర్పాటు కానున్న మునగ ఆకు ప్రాసెసింగ్ యూనిట్ కు ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ లావు గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుల్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మానసపుత్రికలు దేశానికే గర్వకారణంగా నిలిచాయి. : ప్రత్తిపాటి.
చంద్రబాబు మానసపుత్రికలైన డ్వాక్రా సంఘాలు నేడు దేశానికే గర్వకారణంగా నిలిచాయని, అంచెలంచెలు గా తమ ఆర్థిక ఉన్నతికి వారు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయమని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం బ్యాంకులు రుణాలు అందించడంలో ఉదారంగా వ్యవహరి స్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నేడు యడ్లపాడు మండలంలో తొలి మునగ ఆకు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. దీంతో పాటు కట్టుబడివారిపాలెం, బుక్కా పురం, చిలకలూరిపేట పట్టణంలో కూడా ఈ తరహా యూనిట్స్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. మునగాకు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుతో మునగ రైతులకు ఆర్థికంగా లాభం కలుగు తుందన్నారు. ఎకరాకు రూ.లక్షకు పైబడి ఆదాయం వస్తుందన్నారు. రైతులతో పాటు, డ్వాక్రా మహిళలకు ఉపయోగపడే ప్రాసెసింగ్ యూనిట్లను వీలైతే భవిష్యత్ లో గ్రామానికొకటి ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వాలతో పాటు బ్యాంకులు కూడా మహిళల ఆర్థిక ఉన్నతికి తమవంతు చేయూత నందిస్తున్నాయని, బ్యాంకు రుణాల చెల్లింపులో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఈ సందర్భంగా ప్రత్తిపాటి సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం.. డ్వాక్రా మహిళల భాగస్వామ్యంతో మండలానికో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం : ఎంపీ లావు మునగ ఆకుతో ఎనలేని ప్రయోజనాలు లభిస్తాయని, రూ.1కోటి 40 లక్షలతో జిల్లాలో మొదటి మునగ ఆకు ప్రాసెసింగ్ యూనిట్ కు శంకుస్థాపన చేశామని, తొలి దశలో మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటుచేసి, అవి విజయవంతమైతే వాటి సంఖ్య మరింత పెంచుతామని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయంతో పాటు.. డ్వాక్రా మహిళల భాగస్వామ్యంతో ఈ తరహా ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడంతో పాటు, ఉత్పత్తుల తయారీ, విక్రయ నైపుణ్య శిక్షణను కూడా అందిస్తున్నామని ఎంపీ చెప్పారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులతో పాటు, ప్రాంతాలను బట్టి తయారయ్యే ఇతర ఉత్పత్తులు, వస్తువులకు కూడా తగిన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. చిలకలూరిపేట పట్టణంలో ఫర్నీచర్ తయారీ, మార్కెటింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరినట్టు ఎంపీ చెప్పారు. అదేవిధంగా భవిష్యత్ లో జిల్లాలోని 28 మండలాల్లో ఈ తరహా యూనిట్ల ఏర్పాటు జరుగుతుందన్నారు. స్వయం సహాయక సంఘ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యంలో భాగంగా త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రంలో ఏర్పాటైన యూనిట్లను పరిశీలించి, డ్వాక్రా సభ్యులతో మాట్లాడతారని లావు తెలిపారు. ఈ ప్రాంత మునగ రైతులు ఇకపై ఆకుని కూడా అమ్ముకొని లబ్ధి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జవ్వాజి మధన్ మోహన్, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు ముద్దన నాగేశ్వరరావు, కందిమల్ల రఘురామారావు, మద్దినేని సుబ్బారావు, పోపురి వెంకయ్య, తులావ మాణిక్యాలరావు, యినాదుల భాస్కర్, దుర్గారావు, ఆంజనేయులు, వెంకట్రావు, డిఆర్డిఓ పిడి ఝాన్సీ రాణి, సిబిఐ ఆర్ఎం, యడ్లపాడు మండల ఎమ్మార్వో, ఎంపీడీవోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.