

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 15 తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లె పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్ర. స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు కస్సెట్టి జగన్ బాబు మాట్లాడుతూ సమాజమే ఒక దేవాలయం అందులోనే మనం జీవిస్తున్నాము. మనం ఆరోగ్యంగా జీవించాలంటే మన ఇల్లు పరిసరాలు మరియు పాఠశాల ప్రాంతాలు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి అలాగే తడి చెత్తను రెడ్ డస్ట్ బిన్ పొడి చెత్తను గ్రీన్ డస్ట్ బిన్ మరియు డేంజరస్ వాటిని బ్లూ డస్ట్ బిన్ వాడాలి అని అవగాహన కల్పించారు.
