Listen to this article

జనం న్యూస్ జనవరి 10 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్: విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస రావు ఆధ్వర్యంలో గత కొన్నేళ్ళుగా ప్రతి శుక్రవారం స్థానిక దేవిచౌక్ శ్రీ కనక దుర్గమ్మ వారి ఆలయం వద్ద 50 కేజీల పులిహోర, డ్రైవర్స్ కాలనీ శ్రీ కనక దుర్గ అమ్మవారి ఆలయం, అలాగే గాదేలపాలెం గ్రామంలోని శ్రీ కనక దుర్గమ్మ అమ్మ వారి ఆలయం, ఏజెన్సీ దేవీపట్నం మండలం ఇందుకూరు పేట గ్రామంలోని శ్రీ కనక దుర్గమ్మ ఆలయం వద్ధ పులిహోర ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, అనంతరం ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేస్తున్నారు. శుక్రవారం కూడా యధావిధిగా ఆయా ఆలయాల వద్ధ భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రామస్థులు, భక్తులందరూ అమ్మవారి తీర్థ ప్రసాదాలు తప్పకుండా స్వీకరించాలని, రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు కోరారు. అమ్మవారి చల్లని ఆశీస్సులతో వారం వారం దేవాలయాల వద్ద సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప, తామర్ల రాంబాబు, ఇనకోటి బాపన్న దొర, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాధ రావు శర్మ, కట్టా కళ్యాణ్, దేవి చౌక్ కమిటీ సభ్యులు, సేవకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు…