

జనం న్యూస్: ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి , ఫిబ్రవరి 15: అమరావతి: ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వల్లభనేని వంశీ జైలుకెళ్లారని మంత్రి లోకేశ్ అన్నారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్న ఆయన.. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేసిన వైకాపా నేతలు, అధికారులను చట్టపరంగా శిక్షిస్తామని యువగళంలో రెడ్ బుక్ చూపించి చెప్పామన్నారు. తెలుగుదేశం నాయకుల్ని గత ఐదేళ్లలో చట్టాలు ఉల్లంఘించి ఇబ్బందిపెట్టిన వారిపట్ల రెడ్ బుక్ అమలవుతుందని తెలిపారు. 2019-24 మధ్య సాగిన అరాచకపాలన ప్రజలందరికీ తెలుసన్నారు.ప్రజాసమస్యలపై పోరాడు తుంటే అడుగడుగునా ఇబ్బందులు పెట్టి.. చంద్రబాబు బయటకు రాకుండా ఇంటి గేటుకు తాళ్లు కూడా కట్టారని గుర్తు చేశారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రభుత్వ అక్రమాలను నిలదీస్తే.. అక్రమ కేసులు పెట్టడం, పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని నారా లోకేశ్ దుయ్యబట్టారు.