

జనం న్యూస్ ఫిబ్రవరి 17, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) కొండపాక మండల పరిధిలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన జిర్ర రాజు, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు కూతురు నివేదిత వివాహ వేడుకలు సిద్దిపేట లో అర్ఎస్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ముదిరాజ్ సంఘం మహా సభ ఉప అధ్యక్షులు కొట్టల యాదగిరి,వర్గల్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శ్రీరామ్,నర్సింలు, జగదేవపూర్ మండల ముదిరాజ్ సంఘం యువజన అధ్యక్షులు హేమ సురేష్, మనోహరబాద్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు దాసరి నరేష్,చందు,రాము,పిట్ల రాములు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.