Listen to this article

బిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎ దత్తు రావు

జనం న్యూస్,ఫిబ్రవరి 17,కంగ్టి మండల ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంమ్గి బి గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు,జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఆరె దత్తు రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు అభిమానులతో కలిసి మొక్కలను నాటారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత, గులాబీ దళపతి కెసిఆర్ అని అన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఉవ్వెత్తున ఎగిసిపడి పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు,అని అన్నారు 60 ఏళ్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను 14 ఏళ్లలో నెర వేర్చిన ఉద్యమ నేత,అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించిన బంగారు తెలంగాణ నిర్మాత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు,ను హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపు కోవాలని ఆ భగవంతుడు ఆయనను దీర్ఘాయువు తోపాటు, తెలంగాణ ప్రజల సేవ చేయుటకై ఆయుర్ ఆరోగ్యాలను ప్రసాదించాలని ముక్కోటి దేవతలకు వేడుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో గొల్ల శంకర్,కాస్ప నారాయణ,పండరీ, పురం బిమన్న, రాములు,తదితరులు పాల్గొనరు.