Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 17, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోనీ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బిఆర్ఎస్ అధినేత కారణజన్ముడు అని, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కెసిఆర్ గుర్తుగా మొక్కలు నాటి, అలాగే పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి, రోగులకు పండ్లను పంపిణీ చేసిన పరిగి మాజీ శాసనసబ్యూలు కొప్పుల మహేష్ రెడ్డి. ఈ కార్యక్రమం లో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంజనేయులు, మాజీ ఎంపీపీ కరణం అరవింద్ రావు ,ప్రవీణ్రె డ్డి, ఆకారపు రాజు , రవి, మౌలానా, బిఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.