

కాంగ్రెస్ పార్టీ వాంకిడి మండల అధ్యక్షులు గుర్నూలే నారాయణ
జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోఏర్పాటు చేసిన సమావేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ
ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఏమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఏమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా: వి. నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పని చేయలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి మన ఏమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని,ఏ మ్మెల్సీ పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మెదక్ జిల్లా పట్టబద్రులు కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని,మన ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలం లోపే దాదాపు 56 వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది మన రేవంత్ రెడ్డి ,మన కాంగ్రెస్ త్వమని,కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉండే ప్రభుత్వమని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇంటింటికి గడపగడపకు వెళ్లి పట్టభద్రులను కలిసి మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి విద్యా పట్ల ఉద్యోగాల పట్ల అనుభవం ఉన్న వ్యక్తి అని,కరీంనగర్ అదిలాబాద్ నిజాంబాద్ మెదక్ పట్టభద్రులు అందరూ మీ మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డి కి వేసి వారిని భారీ మేజారిటీతో గెలిపించాలన్నారు.