

జనం న్యూస్,ఫిబ్రవరి18, అచ్యుతాపురం: మండలం లోని మత్స్యకార గ్రామమైన పూడిమడక రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 82,83 కు సంబంధించిన 80 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి రుగుడు,జీడి తోటలను అక్రమంగా నరికి ట్రాక్టరుతో దున్నించి భూమిలో పనులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ జనార్దన్ మరియు పోలీసు స్టేషన్లో పూడిమడక నాలుగు గ్రామాల పెద్దలు,ప్రజలు ఫిర్యాదు చేశారు.