

జనం న్యూస్ జనవరి 11 ముద్దనూరు : ముద్దనూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అలవలపాటి ముకుందా రెడ్డి సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యునైటెడ్ వెల్ఫేర్ జి ఎస్ డబ్ల్యూ ఎస్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలండర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఎస్. యాసీన్, ముద్దునూరు పంచాయతీ సెక్రటరి డి.నరసింహులు బొందలగుంట పంచాయతీ సెక్రెటరీ ఎస్.మౌలానా కొరపాడు పంచాయతీ సెక్రెటరీ కే. బలరాముడు బొందలగుంట ఏ హెచ్ ఏ ఎం.శివలింగేశ్వర్ రెడ్డి, శెట్టి వారి పల్లె ఏ హెచ్ ఏ పి. నాగమయ్య యామవరం డి.ఏ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.