

జనం న్యూస్ 18 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణం గాజులరేగలో ఫిబ్రవరి 12న జరిగిన హత్య కేసును చేధించి, హత్యకు పాల్పడిన నిందితుడు కరణపు సాయి ముదురు (20 సం.లు) ను విజయనగరం 2వ పట్టా పోలీసులు అరెస్టు చేసినట్లుగా విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఫిబ్రవరి 16న టూ టౌన్ పీఎస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ – విజయనగరం పట్టణం గాజులరేగకు చెందిన కరణపు సూరిబాబు (50 సం.లు) ఫిబ్రవరి 12న మరణించగా అతని మరణంపై అనుమానం ఉందని భార్య కరణపు బంగారులక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. టూ టౌన్ సిఐ టి.శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టి, శవ పంచనామ శవాన్ని పోస్టు మార్టంకు తరలించగా, డాక్టరు కరణపు సూరిబాబు హత్య చేయబడినట్లుగా నిర్ధారించారన్నారు. అనంతరం, విచారణలో సూరిబాబుకు అతని కుమారుడు సాయికి ఆస్తి విషయమై తరచూ గొడవ పడుతుండేవారని, ఇంటిని అమ్మి, డబ్బులు కుమారుడు సాయికి ఇవ్వాలని డిమాండు చేస్తున్నట్లుగా వెల్లడైందన్నారు. ఇదే క్రమంలో ఫిబ్రవరి 12న సాయి మద్యం కొనుగోలు చేసి, తండ్రి సూరిబాబుతో త్రాగించారన్నారు. రాత్రి 9-30 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న తండ్రితో గొడవపడి, గుండెలపై బలంగా పిడి గుద్దులు గుద్దడంతోను, కాళ్ళపైన, పొట్టపైనా బలంగా గుద్దడంతో మరణించాడన్నారు. విచారణలో నిందితుడు కరణపు సాయి ముదురు ను ఫిబ్రవరి 16న అరెస్టు చేసి, రిమాండుకు తరలించినట్లుగా డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో టూ టౌన్ సిఐ టి.శ్రీనివాసరావు, ఎస్సై కనకరాజు పాల్గొన్నారు.