

అమ్మవార్లను దర్శించుకున్న యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్,ఫిబ్రవరి 18 : అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం లోని నడింపల్లి, మడుతూరు గ్రామాల్లో శ్రీశ్రీశ్రీ పైడితల్లి మరియు నూకాలమ్మ అమ్మవార్ల పండుగలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అమ్మవార్ల పండగ సందర్భంగా యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ను ఆలయ కమిటీ వారు ఆహ్వానించి అర్చకులుచే ప్రత్యేక పూజలు ర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.