

జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) రాయవరం మండలం వెదురుపాక ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కోట బుజ్జి ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో పాఠశాల పండగ వాతావరణాన్ని తలపించింది. సాంప్రదాయ దుస్తులను ధరించి విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులచే పాఠశాల నందు భోగిమంటను ఏర్పాటు చేసి, ముగ్గుల పోటీ నిర్వహించారు. తెలుగుతనం ఉట్టి పడేలా విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సత్యనారాయణ మాట్లాడుతూ హిందూ పండుగలు విశిష్టతను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.