Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సమగ్ర కుల సర్వే నిర్వహించి, ఓబీసీల సాధికారత కోసం డేటాను ఉపయోగించాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన కార్యక్రమం దేశానికి దిశా నిర్దేశంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దేశంలోనే ప్రధమంగా మొదలుపెట్టి రికార్డ్ సృష్టిస్తూ విజయవంతంగా పూర్తి చేసిన బీసీ కుల గణన సర్వే సందర్భంగా శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కూన సత్యం గౌడ్ శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శిరీష సత్తూర్ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా శిరీష సత్తూర్ మాట్లాడుతూ ఓబీసీల సాధికారత, అభివృద్ధి కోసం, నలబై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు సుకోవాటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బాలాగౌడ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.