

జనం న్యూస్: ఫిబ్రవరి 18: నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన షేక్ సయ్యద్ హుస్సేన్ (38) ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కుటుంబ పరిస్థితి దయనీయ స్థితిలో ఉందని గ్రహించిన 1997-98 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన తోటి స్నేహితులు తమ వంతు సహాయంగా రూ.40,000/-లు జమచేసి మంగళవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.