Listen to this article

ఎన్నికల్లో కష్టపడ్డ వారికి మంచి గుర్తింపు ఉంటుంది.. -42 నియోజకవర్గ లో కంటే హుజురాబాద్ నుండి మెజారిటీ దిశగా పనిచేయాలి..నిరుద్యోగులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం..-నియోజకవర్గంలోని అన్ని పట్టణ,మండల కేంద్రాల్లో విస్తృత స్థాయి సమావేశాలు..-సుడిగాలి పర్యటనతోకాంగ్రెస్ కార్యకర్తలను ఉత్తేజపరిచిన వోడితల ప్రణవ్..-ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యహాలపై కార్యకర్తలకు దిశా-నిర్దేశం..

జనం న్యూస్ //ఫిబ్రవరి //18//జమ్మికుంట //కుమార్ యాదవ్..రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై హుజురాబాద్ నియోజకవర్గం లోని హుజురాబాద్,
జమ్మికుంట, వీణవంక ఇళ్లందకుంట, కమలాపూర్, మండలాల్లో, రెండు మున్సిపాలిటీ పట్టణాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్.ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై కాంగ్రెస్ కార్యకర్తలకు దిశా-నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన సంవత్సర కాలంలో ప్రభుత్వం నిరుద్యోగులకు 55 వేల పైచిలుకు ఉద్యోగాలు అందజేసిందని,42 నియోజకవర్గాల కంటే ఈ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీ ఇచ్చి హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.పట్టభద్రుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని దీన్ని ఓటర్ల ఇంటికి వెళ్లి విసృతంగా ప్రచారం చేయాలని సూచించారు.ఇతర అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి చాలా తేడా ఉందని విద్యాసంస్థల పేరునే తన మార్చుకొని,పట్టభద్రుల సమస్యలపై శాసనమండలిలో చర్చిస్తారని, వాటి పరిష్కారం కృషి చేస్తారని అన్నారు.గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టభద్రులను ఇబ్బందులకు గురి దనీ,సమయానికి జీతాలు ఇవ్వక వారి జీవితాలతో అడుకుందని,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖే జీతాలు అందజేస్తున్నామని తెలిపారు.బీజేపి పార్టీ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని,దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.ప్రభుత్వ రంగంతో పాటు,ప్రయివేటు రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలకు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని దీనికి సూచికగా ఇటీవలి దావోస్ పర్యటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి,ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు భారీగా పెట్టుబడులు తీసుకురావడమే నిదర్శనమని అన్నారు.రాబోయే,మూడు,నాలుగు నెలల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తామని తెలిపారు.