Listen to this article

జనం న్యూస్ ప్రతి పి. జయరాం:- మండల పరిధిలో గల జనార్ధనవలస గ్రామ రోడ్డు సమీపంలో శ్రీకాకుళం విజిలన్స్ ఎస్పి శ్రీబర్ల ప్రసాద్ రావు శుక్రవారం 2300 కేజీల అక్రమ రేషన్ బియ్యం పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తుగా సమాచారం మేరకు పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం జనార్ధన వలస సెంటర్ వద్ద కు రేషన్ బియ్యం ను అక్రమంగా ఒరిస్సా కు తరలిస్తున్న ap 35 x 8829 బొలెరో వాహనం ను పట్టుకోవడం జరిగింది అని అన్నారు ఆ వాహనం యజమాని మరియు బియ్యం యజమాని అయిన వంగర మండలం లక్ష్మీంపేట గ్రామానికి చెందిన ఆవు చిన్నం నాయుడు పైన 6 ఏ కేసు మరియు క్రిమినల్ కేసు చర్యలు తీసుకొంటామని విజిలన్స్ ఎస్సై బి.రామారావు సి ఎస్ డి టి రమేష్ తెలియజేసారు. ఈ దాడుల్లో విజిలన్స్ సిబ్బంది పురుషోత్తం మరియు లక్మీ నారాయణ పాల్గొన్నారు.