Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 18:: అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి పట్టణం జీవీఎంసీ గవరపాలేం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జాతీయ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు జాతీయ క్షయ నివారణ కార్య్రక్రమంలో భాగంగా హెడ్ మాస్టర్ ర్యనారాయణ, డాక్టర్ ఎం.ఏస్.వి.కే బాలాజీ ఆదేశాలతో డి. పి .సి అయ్యప్ప ఆధ్వర్యంలో క్షయ వ్యాధి పై విద్యార్దులకు గాహన కల్పించారు.ఈ సందర్భంగా డి పి సి అయ్యప్ప మాట్లాడుతూ క్షయ వ్యాధి మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్ కల్సేస్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చేందుందని తెలియచేశారు.రెండు వారాల మించిన దగ్గు సాయంత్రం పూట జ్వరం బరువు తగ్గిపోవటం ఆకలి మందగించటం తదితర లక్షణాలు వున్న వెంటనే దగ్గరలో వున్న పీ. హెచ్ సి, యు పి హెచ్ సి,సి హెచ్ సి లలో గళ్ళ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని తెలియచేశారు.ఈ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ శ్రావణి,డి పి ఏస్ రామకృష్ణ,ఎస్పీ ఏస్ పెంటయ్య, పిపిఎం ఏళ్లాజీ,ఏస్టి ఎల్ ఏస్ పద్మజ, టీ బీ హెచ్ వి లక్ష్మి ఆశ తదితరులు పాల్గొన్నారు.//