Listen to this article

జనం న్యూస్ 10 జనవరి కోటబొమ్మాళి మండలం: ముక్కొటి ఏకాదశి సందర్భంగా మండలం పెద్ద హరిశ్చంద్రపురం శ్రీ కోదండరామ ఆలయంలో శుక్రవారం 2వేలు మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ఇదే గ్రామానికి చెందిన దుంపల కృష్ణారావు, సావిత్రి దంపతులు రూ. 50వేలు విరాళంగా అందజేశారని అలయ కమిటి సభ్యులు పూజారి సత్యన్నారాయణ తెలిపారు. అలాగే మండలం గుంజిలోవ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు వేకువజామునుంచి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ధర్మకర్త పేడాడ చిరంజీవులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే మండలం ఊడికలపాడు గ్రామ శ్రీరామమందిరంలో భగవద్గీత ప్రవచన కారులు సనపల కరుణ్‌కుమార్‌, రమణమ్మలు భగవద్గీత ప్రారాయణం చేశారు. అలాగే పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.