

జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 100% స్రైక్ రేట్ తో రాజకీయాల్లో కొత్త అద్యాయానికి తెరతీసిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేద్దామని జనసైనికులకు జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గారు పిలుపునిచ్చారు. మంగళవారం బాలాజీ నగర్ లోని జనసేన కార్యాలయంలో విజయనగరం నియోజకవర్గం పట్టణ జనసైనికులు, వీరమహిళలతో నిర్వహించిన సమావేశంలో అవనాపు విక్రమ్ గారు మాట్లాడుతూ విజయనగరంలో జనసేన బలంగా ఉందని, మరింత బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ అవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసే బాధ్యత ప్రతీ జనసైనికుడిపై ఉందన్నారు. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ జనసేన వైపు చూస్తున్నాయని అన్నారు. జనసేన సిద్దాంతాలు, జనసేన అధినేత & ఉప ముఖ్యమంత్రి గౌ. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకు తీసుకువెళ్లాలన్నారు. జనసేన అంటే ప్రజలకు ఒక భరోసా అని, క్రమ శిక్షణ, బాధ్యతలకు మారు పేరన్నది రుజువు చేయాల్సిన బాధ్యత జనసైనికులపై ఉందన్నారు. పార్టీ కోసం గత పదేళ్లుగా కష్టపడిన వారికి గుర్తింపునిస్తూ, జనసైనికులు, వీరమహిళతో కలిసి పార్టీని మరింత శక్తి వంతంగా తీర్చిదిద్దే విధంగా ముందుకు సాగాలన్నారు. జనంలో ఉంటూ, జనం కోసం పనిచేయడమే జనసైనికుడి ప్రధమ కర్తవ్యంగా భావించాలన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారం కోసం కష్టపడి పనిచేద్దామన్నారు. పదవులు కోసం కాకుండా పార్టీ కోసం పనిచేద్దామని అవనాపు విక్రమ్ గారు అన్నారు. సమావేశంలో విజయనగరం పట్టణ జనసేన నాయకులు పత్తిగిల్లి వెంకటరావు,ఎర్నాగుల చక్రవర్తి,పతివాడ చంద్రశేఖర్,హుస్సేన్ ఖాన్, శివ, ఆనంద్,సంపత్ రాజు,ఎం.ఉమామల్లిఖార్జున రావు,షేక్ మారేష్,గౌరీ శంకర్,మద్దిల అప్పలనాయుడు,కంటుభుక్త సతీష్, ముని లక్ష్మణ,మద్దిల నారాయణరావు,ముని ప్రవీణ్, కుమార్, కనకాల రాజు, ఏలుసురి విశ్వ, తారకేష్, వీరమహిళలు గంట్లా పుష్ప కుమారి,ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.